Thursday, January 23, 2025

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల అధ్యక్షులు సత్తవరం నర్సింహా రెడ్డి అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశంలో గ్రామాలలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధిపై సర్పంచులు, ఎంపిటిసిలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.

గ్రామాలలో విద్యుత్ సమస్యలు పేరుకుపోయాయని విద్యుత్ అధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమావేశం దృష్టికి సర్పంచులు, ఎంపిటిసిలు తీసుకువచ్చారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని అధికారులు స్పందించకపోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయని ఎంపిటిసిలు సభ దృష్టికి తేగా సంబంధిత అధికారులు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్దాపూర్, గుడిపల్లి గ్రామాల మధ్య బిటి రోడ్డు నిర్మాణంలో ఉండగా నెల రోజుల క్రితం కంకర పరిచి వదిలివేయడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదే విధంగా గ్రామంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని పెద్దాపూర్, బొందలపల్లి ఎంపిటిసి కుసునూరు కవిత సమావేశంలో ప్రశ్నించారు. వర్షాకాలం కొనసాగుతున్న సందర్భంలో గ్రామాలలో పారిశుద్ధంపై పట్టించుకునే వారు లేరని పలు గ్రామాల సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. సర్వసభ్య సమావేశంలో వైస్ ఎంపిపి నిర్మల, డిఎల్‌పిఓ రామ్మోహన్, ఎంపిడిఓ కోటేశ్వర్, జెడ్పిటిసి శ్రీశైలం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News