Sunday, November 17, 2024

15 ఏళ్లకే బీఏ.. మోడీ మెచ్చిన తనిష్క గురించి తెలుసా ?

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేయడమే కాక, 15 ఏళ్లకే బీఏ ఫైనల్ పరీక్షలు రాయడానికి సిద్ధమైన ఓ అమ్మాయి భారత ప్రధాన న్యాయమూర్తి కావడమే తన లక్షమని ప్రధాని నరేంద్ర మోడీకి స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన తనిష్క సుజిత్ ఇటీవల జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోసం భోపాల్ వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోడీని కలుసుకోగలిగింది. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో ప్రధాని ముచ్చటించారు. “ జీవితంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావు ” అని ప్రధాని నన్ను అడిగారు. నేను ప్రస్తుతం బీఏ మూడో ఏడాది చదువుతున్నాను. ఫైనల్ పరీక్షలు పూర్తయ్యాక అమెరికా వెళ్లి న్యాయశాస్త్రం చదవాలని , ఏదో ఒక రోజు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాలని లక్షంగా పెట్టుకున్నానని ప్రధానితో చెప్పాను. నా మాటలు విన్న ప్రధాని నాకో సూచన చేశారు.

సుప్రీం కోర్టుకు వెళ్లి అంతా పరిశీలించాలన్నారు. అక్కడ న్యాయవాదుల వాదనలను వినాలని సూచించారు. ఆయన ఇచ్చిన సలహా నా ఆశయం నిజం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ” అని తనిష్క ఆనందం వ్యక్తం చేసింది. చిన్నతనం నుంచి చదువుల్లో మేటిగా రాణిస్తున్న తనిష్క సుజిత్ కొవిడ్‌తో తండ్రిని, తాతను కోల్పోయినా, ఆ బాధను దిగమింగుకుని మనో ధైర్యంతో తన లక్ష సాధనవైపుగా అడుగులు వేస్తోంది. ఇండోర్‌కు చెందిన తనిష్క 13 ఏళ్ల వయసు లోనే దేవి అహల్య విశ్వవిద్యాలయంలో ప్రవేశ పరీక్షలో తన ప్రతిభతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ప్రతిభను యాజమాన్యం మెచ్చుకుని ఇదో ప్రత్యేక కేసుగా పరిగణించి బీఏ (సైకాలజీ)లో ప్రవేశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News