Friday, December 20, 2024

పెన్సిల్ కూడా కొనలేక పోతున్నా…

- Advertisement -
- Advertisement -

A girl's letter to PM Modi

ప్రధాని మోడీకి బాలిక లేఖ

లక్నో : కనీసం పెన్సిల్, రబ్బర్ కూడా కొనలేక పోతున్నానని, అవి పోయాయంటూ ఒకటో తరగతి చదువుతున్న బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు ప్రధాని మోడీకి ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన ఆరేళ్ల కీర్తి దూబే 1 వ తరగతి చదువుతున్నది. ఆమె పెన్సిల్, రబ్బర్‌ను క్లాస్‌లో చోరీ చేస్తున్నారు. దీంతో కొత్త పెన్సిల్ కొనమని తల్లిని అడుగుతుండగా ఆమె మందలిస్తుంది. ఇది పరిపాటిగా మారింది. కానీ ఆదివారం ఆ చిన్నారీ , మ్యాగీ ప్యాకెట్ కొనేందుకు ఐదు రూపాయలతో షాప్‌కు వెళ్లింది. అయితే మ్యాగీ ప్యాకెట్ ధర ఏడు రూపాయలు పెరిగినట్టు షాప్ వ్యక్తి చెప్పాడు.

దీంతో ఆ పాప నిరాశతో ఇంటికెళ్లి మళ్లీ కొత్త పెన్సిల్ కోసం మారాం చేయగా తల్లి మందలించింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక ధరల పెరుగుదలపై ప్రభాని మోడీకి లేఖ రాసింది. “ ప్రధాన మంత్రి జీ… నాపేరు కీర్తి దూబే. నేను ఒకటో తరగతి చదువుతున్నా. మీరు ధరలు విపరీతంగా పెంచారు. నా పెన్సిల్ , ఎరేజర్ కూడా ఖరీదయ్యాయి. మ్యాగీ ధర కూడా పెరిగింది. నేన పెన్సిల్ అడిగితే మా అమ్మ కొట్టింది. నేను ఏమి చేయాలి ? ఇతర విద్యార్థులు నా పెన్సిల్‌ను దొంగిలించారు. అని హిందీలో రాసింది. మరోవైపు న్యాయవాది అయిన బాలిక తండ్రి విశాల్ దూబే, తన కుమార్తె రాసిన లేఖను ప్రధాని కార్యాలయానికి సోమవారం రిజిస్టర్ పోస్టు చేశారు. దీంతో ఆ లేఖ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News