మహబూబాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహబూబాబాద్ ఐడిఓసిలో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహిత్య దినోత్సవ కార్యక్రమంలో కవులు తమ కవిత్వాలతో అలరించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు చిన్నారులు తమ నృత్యాలు, సంగీతంతో అలరించారు.
కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు గత తొమ్మిదేళ్ల తెలంగాణ పాలనలో సాధించిన ప్రగతి, పురగతులను పొగుడుతూ తమ కవిత్వాలను వినిపించారు. రాష్ట్ర పురోగతులను ఆవిష్కరిస్తూనే తెలంగాణలోని వనరులు, సంపదలు, ఆలయాలు, సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరింపచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సాహితి రంగం చేసిన ఎనలేని కృషిచేసిందని పేర్కోన్నారు. ఎందరో కవులు, గాయకులు తమ కలాలు, గళాల నుంచి కవిత్వాలు, ఉత్సహా పరిచే గీతాలను సృష్టించి అన్ని వర్గాలను ఉద్యమంవైపు నడిపించారని తెలిపారు.
వారి కృషి వల్లే తెలంగాణ ఉద్యమానికి ఊపిరులు పోసిన కవులు, కళాకారుల విస్త్రత సేవలను ప్రస్తుతించారు. అనంతరం ఉత్తమ వచన కవిత్వంలో ఐదుగురు, పద్య కవిత్వంలో ఒక్కరు మొత్తంగా ఆరుగురి కవులను ఎంపిక చేశారు. వారిలో వచన కవిత్వంలో రహీముద్దీన్, దయ్యాల ఐలయ్య, చాగంటి కిషన్, వెంకటలక్ష్మీ, రమాదేవి, పద్య కవిత్వంలో జక్కి నాగేశ్వర్‌లను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు.
మానుకోటకు చెందిన జర్నలిస్టు గుండోజు శ్రీనివాస్ కవితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఆయన్ను సన్మానించారు. అలాగే ఈ కవి సమ్మెళనంలో పాల్గొన్న కవులందరినీ కలెక్టర్ కె. శశాంక ఘనంగా సత్కరించి వారికి ప్రసంశా పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు సయ్యద్ ఖుర్షీద్, రమాదేవి, సూర్యనారాయణ, తానేశ్వర్, డాక్టర్ సుధాకర్, డీపీఆర్వో కన్నెగంటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.