Thursday, January 23, 2025

వైభవంగా ఆధ్యాత్మిక దినోత్సవం

- Advertisement -
- Advertisement -

బోధన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ ఎంపిపి బుద్దే సావిత్రి, ఎంపిటిసి కండెల సవిత, ఆలయ కమిటీ ఛైర్మన్ యెల్మ దత్తు, బిఆర్‌ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్ బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంఎల్‌ఏ షకీల్ ఎంతో ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. అతి తక్కువ సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణం చేసిన సిఎం కెసిఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఏలకు కృతఙ్ఞతలు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో ఎంఎల్‌ఏ షకీల్ సహకారంతో 27దేవాలయాల్లో దీపదూప నైవేద్యం కింద పూజారులను నియమించి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడిఓ పర్బన్న, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, మాజీ సహకార సంఘ ఛైర్మన్ శివకాంత్ పటేల్, వార్డుసభ్యులు శ్రీరాం గంగాధర్, బండే గంగాధర్, కల్లూర్ లక్ష్మణ్, గ్రామ పెద్దలు, బుయ్యన్ సురేష్, కెజి గంగారాం, వెంకట్ పటేల్, కన్నె రమేష్, ఆలయ కమిటీ సభ్యులు బచ్చు రాజు, అవుటి లస్మన్న, పూజారి నరేష్ పంతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News