Monday, December 23, 2024

స్వరాష్ట్ర పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమైంది

- Advertisement -
- Advertisement -
  • 11వ రోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రన్
  • ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు: సిఎం కెసిఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధ్ది సాధించిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు సోమవారం స్థానిక ఇక్రిసాట్ నుంచి మైత్రి మైదానం వరకు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక డిఎస్పి భీంరెడ్డి, సిఐ వేణుగోపాల్ రెడ్డిలతో కలసి బెలూన్‌లు ఎగరవేసి ప్రాంరంభించిన రన్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత మంచి పనులన్నిటిలో ముందుకు రావాలని, వారు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏది ఉండదన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సకాలతో యువత ముందుకు పోతుందన్నారు. ప్రస్తుత రోజుల్లో యువతను డ్రగ్స్ సమస్య శాపంగా మరిందన్నారు. యువత అటువైపు మల్లకుండా ఉండాలన్నారు. క్రీడల ద్వారా యువతకు మంచి అవకాశాలు అందుతాయన్నారు. క్రీడలపై యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సొంత నిధులతో నియోజకవర్గంలోని యువతకు పోలీసు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. దాంతో 500 మంది యువత ఉద్యోగాలు సంపాదించుకో కలిగారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రథినిధులు ప్రభాకర్, సుధాకర్ రెడ్డి, మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేశ్, పోలీస్ అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News