Monday, December 23, 2024

తృతీయ ఫ్రంట్‌కు మంచి అవకాశం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ సారథ్యం వహించాలి
ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ వ్యాఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో తృతీయ ఫ్రంట్‌కు బలమైన అవకాశాలు ఉ న్నాయని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అందుకు నేతృత్వం వహించాలని కో రారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని ఆ శూన్యతను కెసిఆర్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ భర్తీ చేయగలుగుతుందని అభిప్రా యం వ్యక్తం చేశారు. కెసిఆర్ చొరవ తీసుకుంటే విపక్ష కూటమిలో లేని అనేక పార్టీ లు థర్డ్ ఫ్రంట్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిలోకి తనను ఆహ్వానించక పోవడాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇం డియా కూటమిలో కెసిఆర్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాదని ఒవైసి చెప్పారు. ఓ ఆంగ్ల ఛానల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓవైసి పై విధంగా స్పందించారు. కాగా భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం అయిన సెప్టెంబర్ 17న ఎంఐఎం సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ తిరంగా ర్యాలీ నిర్వహించింది. అనంతరం మాసాబ్‌ట్యాంక్‌లోని ఈద్గా మైదానంలో బహిరంగ సభ నుద్దేశించి అసద్దీన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు హైదరాబాద్ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. తాము రజాకార్ల వారసులమని బిజెపి, నిజాం వారసులమని కాంగ్రెస్ విమర్శిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. బిజెపి పని అయిపోయిందని అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఖాసీం రజ్వీతో తమకు సంబం ధం లేదని ఎంఐఎం పార్టీనిఅబ్దుల్ వాహిద్ ఓవైసి స్థాపించారని అసదుద్దీన్ స్పష్టం చేశారు. ళితులు, ఒబిసిలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చెబుతోందని మరి ముస్లింల మాటేంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడరెందుకని నిలదీశారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తానని, మైనార్టీలకు కాంగ్రెస్ ఏమి చేసిందని అడిగారు. రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ లలో ఏమి చేశారో చూపించమనండి‘ అని ఒవైసీ కాంగ్రెస్ను నిలదీశారు. తెలంగాణలో ముస్లింలు అంత్యంత సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్ధిక వ్యవస్థ కూడా బలంగా ఉందని పేర్కొన్నారు. ఓ పక్క కశ్మీర్ లో ఎన్ కౌంటర్‌లు జరుగుతున్న సమయంలో ప్రపంచ కప్‌లో భారత్ క్రికెట్ జట్టు పాక్‌తో తలపడటంపై ఒవైసీ భాజపాను తప్పుపట్టారు. ‘మనం ఓ సైనికుడిని, కర్నల్, మేజర్‌ను కోల్పోయాం. ఈ సమయంలో భాజపా ప్రతిపక్షంలో ఉంటే బిన్నంగా స్పందించేదని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News