Friday, December 27, 2024

బోగీల మధ్య లింక్ తెగి ఆగిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : గూడ్స్ బోగీల మధ్య లింక్ తెగిపోయి నిలిచిపోయిన సంఘటన కేసముద్రం, ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం చోటు చేసుకుంది. విజయవాడ నుండి కాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కేసముద్రం స్టేషన్ పెద్దాయి చెరువు సమీపంలో గార్డ్ ముందు 2వ బోగీ విడిపోయింది. అప్రమత్తమైన గార్డు లోకోపైలట్‌కు సమాచారం అందించారు. రైలు నిలిపివేసిన లోకోపైలట్ రైలును వెనక్కి తీసుకువచ్చి లింకును సరిచేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News