Sunday, January 19, 2025

సిఎం ముందుచూపుతో చేరువైన పాలన

- Advertisement -
- Advertisement -

వనపర్తి ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన దక్షత, ముందు చూపుతో 33 జిల్లాలో ఏర్పడి ప్రజి జిల్లాకు 50 నుండి 55 జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు కావడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం వనపర్తి జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీరు (ఎస్.ఇ) నూతన కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 33 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని జిల్లాలో ప్రజల సౌలభ్యం కొరకు జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు కావడం జరిగిందన్నారు.

ఇందులో భాగంగానే వనపర్తి జిల్లాలో సైతం 50 నుండి 55 వరకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్ర భుత్వ కార్యాలయాలు ఏర్పాటు కావడం జరిగిందన్నారు. ఈ రోజు వనపర్తి జిల్లాలో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు సంబంధించిన ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజనీర్ నూతన కార్యాలయం వనపర్తి జిల్లాలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఒ కప్పుడు ప్రజలు మారుమూల గ్రామాల నుండి తమ అవసరాల కొరకు జిల్లా కేంద్రాలకు వెళితే ఎంతో అసౌకర్యం, ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు అధికారులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడేది అన్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ముందుచూపు,పరిపాలన దక్షతతో నేడు అన్ని జిల్లాలకు జిల్లా స్థాయి కార్యాలయాలు ఏర్పాటు అయ్యాయని దాని మూలంగా సత్వర పనులు జరగడమే కాకుండా అనేక రకాల ఉపాధి, పర్యవేక్షణ పెరిగి సత్వర పనులు పూర్తి కావడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.ఈ ఆర్ అండ్ బియం. నర్సింగమ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజనీరు దేశ్యా నాయక్, డిప్యూటీ ఈ దానయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కారుణ్య నియామక ఉద్యోగులు బాధ్యతాయుతంగా పని చేయాలి
కారుణ్య నియామకం పొందిన ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి మంచి పేరు తె చ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సర్వీసులో ఉం టూ మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాలు కొరకు ఎదురుచూస్తున్న 19 మందికి బుధవారం ఉదయం ఎమ్మెల్యే క్యా ంపు కార్యాలయం లో మంత్రి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ వనపర్తి జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో పని చేస్తూ మరణించిన వారికి వారి వారసులకు విద్యార్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగంలో నియామకాలు ఉంటాయని, ఈ రోజు జి ల్లాలో మొత్తం 19 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో 11 మం దికి రెవెన్యూ శాఖలో , ఎస్సీ కార్పొరేషన్‌లో 2,జి ల్లా సహకార సంఘం కార్యాలయంలో 2, మిగిలినవి ట్రెజరీ, ట్రాన్సోర్ట్, వైద్య ఆరోగ్య శాఖ,ఇరిగేషన్ శాఖలకు ఒక్కో పోస్టు చొప్పున కేటాయించా రు.

కారుణ్య నియామకాలు పొందినవారు నిజాయితీతో పని చేసి మంచిపేరు తెచ్చుకోవాలని తెలియజేశారు. అనంతరం జిల్లా పంచాయతీరాజ్ శా ఖలో 6 మంది జూనియర్ పంచాయతీ సెక్రెటరీల కు రెగ్యులరైజ్ ఉత్తర్వులను మంత్రి చేతులమీదుగా అందజేశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరిలు వారి పనితీరు ప్రామాణికంగా రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింద ని, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు 32 మంది జూ నియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజ్ చే యడం జరిగిందని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ య స్.తిరుపతి రావు, డిపిఓ సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News