Monday, December 23, 2024

కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఎ’ గ్రేడ్

- Advertisement -
- Advertisement -

‘A’ grade for Kaleswaram Corporation

కేంద్ర గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు జాతీయ స్థాయిలో మరో ప్రశంస
ఆర్థిక సంస్థలకు నిర్ణీత గడువులో వాయిదాల చెల్లింపులు, ఆర్‌ఇసి గుర్తింపుతో మరింత పెరిగిన గౌరవం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపైన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన గుర్తింపు గౌరవం లభించాయి. ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టు కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్ధిక సంస్థలనుంచి నిధులు సమీకరించుకుని లక్షం మేరకు పనులు పూర్తి చేసి రైతులకు గోదావరి జలాలను ఆందుబాటులోకి తీసుకురావటంలో సఫలీకృతమైంది. కాళేశ్వరం సమీపాన మేడిగట్ట వద్ద ,మేడిగడ్డశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల మద్య అన్నారం , సుందిళ్ల గ్రామాల వద్ద కాలువలు, సోరంగ మార్గాలు, జలాశయాలు , నీటి పంపిణీ వ్యవస్థలు , ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 13జిల్లాలకు సాగునీరు ,తాగునీరందించేందకు ముఖ్యమంత్రి కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. గోదావరి నదీజలాల్లో 180టిఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను 2016లో ప్రారంభించారు.

స్సెషల్ వెహికల్ పర్పస్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఎక్కడా నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది. పనులు వేగంగా , సమర్ధవంతంగా పూర్తి చేసేందకు యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం , పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియంతోపాటు ఆర్ధిక సంస్థల చేయూతను అందిపుచ్చుకున్నారు. వీటితోపాటు ప్రధాన ఆర్ధిక సంస్థలుగా పేరుగాంచిన పవర్ ఫైనాన్స్ కార్నోరేషన్ ,రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ ,నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్‌మెంట్ )తో కాళేశ్వరం కార్పోరేషన్ ఒప్పదం కుదుర్చుకొంది. రాష్ట్రంలో 37లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్ణీత గడువు ప్రకారం పనులను వేగంగా , సమర్దవంతంగా పూర్తి చేస్తువస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహకంగా ఉన్న గ్రామల ప్రజలకు 10టిఎంసిల గోదావరి జలాలను అందజేస్తూనే ,మరో 30టిఎంసిల నీటని గ్రేటర్ హైదరాబాద్ నగర తాగునీటి అససరాలు తీర్చేందకు అందజేస్తోంది.

అంతే కాకుండా మరో 16టిఎంసీల నీటని పారిశ్రామిక అవసరాలకు కేటాయించి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తూ పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మొత్తం ఏడు లింకులు ,28ప్యాకేజిలుగా విభిజించి పనులు చేప్టింది.అందులో ఇప్పటికే పలు ప్యాకేజిల్లోని పనులు పూర్తయి నీటివిడుదల కూడా జరుగుతోంది. గరిష్ట స్థాయిలో ప్రాజెక్టు కింద పునరావాసం , పునరుద్దరణ పనులు కూడా పూర్తి చేసింది. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పైన ఇప్పటికే 75వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగిందని ,ప్రాజెక్టు మొత్తం ఖర్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఏర్పాటు చేసిన కాళేశ్వరం నీటిపారుదల కార్పోరేషన్ ద్వారా జాతీయ బ్యాంకులు ,పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ,రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ , నాబార్డు నుంచి రుణం స్వీకరించే ఏర్పాటు చేసుకుంది.

రికార్డు స్థాయిలో పనులు :

రాష్ట్ర ప్రభుత్వం ,బ్యాంకులు , ఆర్ధిక సంస్థల సహకారంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ మొదలు కొని కొండ పోచమ్మ సాగర్ జయలాశయం వరకూ పనులు రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి. గోదావరి జలాలను కూడా మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్ వరకూ ఇప్పటికే తరలించారు. కొండపోచమ్మ సాగర్ జలాశయంలో గత నీటిసంవత్సరం నుంచే నీటిని నింపుతూ క్రమేపి ఈ జలాశయంలో నీటి నిలువలను పెంచుతూ వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిగిలిన డిస్ట్రిబ్యూటరీల పనులు, కాలువలు, ఫీల్డ్ చానల్స్ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి.

కృష్ణానదీజలాలను ఉపయోగించుకునేందుకు చేపట్టిన పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కార్పోరేషన్ పరధిలోకే తీసుకొచ్చింది. కార్పోరేషన్ ద్వారా తీసుకున్న ఆర్దిక సహకారాన్ని ప్రాజెక్టు పనులకోసం సమర్దవంతంగా ఉపయోగించుకోవటం, గడువులోపే రుణాలను తిరిగి సకాలంలో చెల్లింపుల ప్రక్రియను పరిశీలించిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ (ఆర్‌ఇసి) కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఏ కేటగిరి గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందటం ద్వారా కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఉన్న గుడ్‌విల్ పెరిగి భవిష్యత్‌లో అవసరమైన రుణాలు సమీకరించుకోవటం మరింత సులభతరం కానుందని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News