Monday, December 23, 2024

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

- Advertisement -
- Advertisement -
వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులకు భాగస్వామ్యం
ప్లాంటేషన్ పేరుతో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలు పంపిణీ: సిఎస్ శాంతికుమారి వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వేడుకల ముగింపు ఉత్సవాల నిర్వహణపై సిఎస్. శాంతి కుమారి శుక్రవారం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ ముగింపు వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులు, భిన్న రంగాలకు చెందిన ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ముగింపు వేడుకల తేదీలను రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో ఖరారు చేస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా, భారత వజ్రోత్సవ ప్లాంటేషన్ పేరుతో ఒక కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్దారించారని, ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జండాలను పంపిణీ చేయడంతోపాటు రాష్ట్రంలోని అన్ని సినిమాహాళ్లలో గాంధీ చలన చిత్రాన్ని ప్రదర్శించనున్నామని వివరించారు.

ఈ ముగింపు వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలను, జంక్షన్లను విధ్యుత్ దీపాలతో అలకంకరించనున్నామని తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల విషయంపై రాష్ట్రంలోని విద్యాసంస్థ లలో వ్యాసరచన, వకృత్వ, పెయింటింగ్ తదితర కాంపిటీషన్లను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 5 కె, 2 కె రన్ లను చేపడతామని అన్నారు. భారత స్వతంత్ర స్ఫూర్తిని తెలియచేసే విధంగా అన్ని పాఠశాలల్లో స్వతంత్ర భేరిని నిర్వహించడంతోపాటు స్వాత్రంత్ర పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమాన్ని తెలియచేసే ఫోటో ప్రదర్శనను నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమాలకు నిర్వహణ సంబందించిన పూర్తి వివరాలను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, పీసీసీఎఫ్ దొబ్రియల్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హ్యాండ్లూమ్స్ శాఖ కమీషనర్ బుద్ధ ప్రకాష్, సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శి అశోక్ రెడ్డి, పంచాయితీ రాజ్ కమీషనర్ హనుమంత రావు, ఆయుష్ శాఖ కమీషనర్ హరి చందన, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తదితరులు న ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News