Thursday, January 23, 2025

ఘనంగా మంచినీళ్ల పండుగ కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

బల్మూర్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలోని మిషన్ భగీరథ సిబ్బంది, గ్రామ పంచాయతి సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు గ్రామ పంచాయతి కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేసి మంచినీళ్ల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ డిఈ హేమలత హాజరై మా ట్లాడుతూ జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు.

మిషన్ భగీరథ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి కాళ్లు, కీళ్ల నొప్పులు రావని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ చంద్రశేఖర్, సర్పంచ్ శివ శంకర్, పంచాయతి కార్యదర్శి చందు, గ్రామ పంచాయతి సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి, సునిత, జయప్రద, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News