Monday, December 23, 2024

పట్నంలో ఘనంగా చెరువుల పండుగ

- Advertisement -
- Advertisement -
  • హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నీటి కరువు ప్రాంంగా ఉండేదని నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలో అన్ని చెరువులు ఇండుకుండలా మారాయని జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని పెద్ద చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ దేవాయలం వద్ద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బతుకమ్మ బోనాలు సమర్పించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ ద్వారా 4 విడతలో రూ. 421 కోట్ల తో పూడికతీతో ఈ చెరువులు నిండడానికి ప్రధాన కారాణమని అన్నారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కాల్వకురూ.16 కోట్లతో పూడిక తీత పనులు చేశామని తద్వారా చెరువు కాల్వ పారుదలతో పట్నం చెరువు నిండడానికి కారణమైందని చెప్పారు.

గత 40 సంవత్సరాల క్రితం నిండిన చెరువు గత సంవత్సరంలో నిం డుకుండలా మారడానికి కాల్వ మరమ్మత్తులే కారణమని చెప్పారు. ఈ చెరువు నిండడంతో సుమారు 40 గ్రామాలకు తాగు నీటితో పాటు సాగునీరు వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటాచారి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల యాదగిరి , కౌన్సిలర్లు , మండల ఎంపిడిఓ క్రాంతి కిరణ్ , మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుప్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలలో చెరువుల పండుగ

మండల పరిధిలోని దండుమైలారం , పోల్కంపల్లి ,రాయపోల్ , చెర్లపటేల్‌గూడ, ముకునూర్ , ఉప్పరిగూడ , పోచారం, కర్ణగూడ , కప్పాడు, ఏలిమినేడు, తుర్కగూడ తదితర గ్రామాలలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ కార్యాక్రమం ఆయా గ్రామాల సర్పంచ్‌ల ఆద్వర్యంలో బతుకమ్మ ,బోనాలు నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఎంపిపి కృపేష్ ,సర్పంచ్‌లు మల్లేశ్వరీ, బల్వంత్‌రెడ్డి, గీతారాంరెడ్డి , శివరాల జ్యోతి రాజు , బూడిద రాంరెడ్డి, పలువురు సర్పంచ్‌లు ఎంపిడిఓ క్రాంతి కిరణ్ తదితరులు హజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News