Saturday, December 21, 2024

పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా హరితదినోత్సవం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సర్కిల్ కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డిసిపి (అడ్మిన్) జి.మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పరేడ్ గ్రౌండ్‌లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ నందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ తమవంతుగా మొక్కలు నాటి మన పిల్లలకు కానుకగా ఇవ్వాలని అన్నారు.

నిజామాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (ఎఆర్) గిరిరాజ్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీశైలం, మహిళా పోలీసు స్టేషన్ సిఐ ప్రతాప్‌కుమార్, టౌన్ సిఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, ఐటి కోర్ సిఐ ముఖీద్‌పాషా, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్స్ అనీల్, శ్రీశైలేందర్, వెంకటప్పలనాయుడు, శేఖర్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసుసిబ్బంది హాజరై మొక్కలు నాటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News