Friday, December 20, 2024

బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా దీక్షాదివస్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ జరుపుకున్నారు. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పధ్నాలుగు సంవత్సరాల క్రితం కెసిఆర్ చేపట్టిన ‘దీక్ష’ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్ నగరంలో రాజేష్ గిరి రాపోలు, ఉదయ్ రెడ్డి, విన్నీ తూముకుంట ఆధ్వర్యంలో ‘కెసిఆర్ దీక్ష దివస్’ను అన్ని నగరాల్లో ఘనంగా నిర్వహించారు.
కెసిఆర్‌ను మూడోసారి గెలిపించాలి: రాజేశ్ రాపోలు
సిడ్నీలో జరిగిన కార్యక్రమంలో రాజేశ్ రాపోలు మాట్లాడుతూ కెసిఆర్ ఉద్యమ, దీక్ష సమయంలో చేసిన త్యాగాలను వివరించారు. రాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని, ప్రవేశపెడుతున్న పథకాల గురించి వివరిస్తూ మళ్లీ కెసిఆర్‌ను మూడో సారి గెలిపించాలని ఆయన కోరారు. మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కెసిఆర్ పోరాట పటిమను, అలుపెరగని పోరాటాన్ని, గాంధీజీ మార్గాన్ని అనుసరించి శాంతియుత దీక్ష ద్వారా కేంద్రం దిగివచ్చేలా చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి అయన చేసిన కృషిని కొనియాడారు.
మరోసారి కెసిఆర్ సిఎం కావడం తథ్యం: విన్నీ తూముకుంట
బ్రిస్బేన్‌లో జరిగిన కార్యక్రమంలో విన్నీ తూముకుంట మాట్లాడుతూ ఉద్యమాన్ని ముందుండి నడిపి, తద్వారా 60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా తెలంగాణను కెసిఆర్ అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని ఆయన తెలిపారు. ఇంతటి గొప్ప నాయకుడు మన తెలంగాణ రాష్ట్రానికి మరొక్క సారి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని, దేశ చరిత్రలో కెసిఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ ధూపాటి , ఉదయసింహా రెడ్డి, విన్నీ తూముకుంట, ప్రకాష్ హనుమంతు ,లక్ష్మణ్ నల్లాన్, ఏజాజ్ , షఫీ, మట్టయ్య గౌడ్, రవి, సాయిప్రసాద్, వేణు నాన, సనిల్ రెడ్డి, సాయికృష్ణ కల్వకుంట్ల, కార్తిక్ సింగిరి కొండ, రాకేష్, యుగంధర్, సంతోష్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

A grand initiation day under the auspices of BRS Australia

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News