Thursday, November 21, 2024

ఘనంగా ఆక్స్‌ఫర్ట్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిట్యూర్ వేడుక

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఇన్వెస్టిట్యూర్ వే డుకను ఘనంగా జరిగింది. 2023-24 విద్యాసంవత్సరానికి గాను కొత్తగా ఎన్నికైన పాఠశాల క్యాబినెట్ వేడుక మార్చి పాస్ట్‌తో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథులుగా మేజర్ జయసుధ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు నాలుగు డిలైనా డ్రీమ్,-డిసైడ్, -డిక్లరేషన్-,డేట్ లను అనుసరించాలని సూచించారు. నాయకత్వం ఆచరణాత్మక ప్రజాస్వామ్య ధర్మాలను నేర్పుతుందని ఆమె కొనియాడారు.

బ్యాడ్జ్ ధరించడం చాలా పెద్ద బాధ్యత అని మరియు స్థిరమైన లక్ష్యాలను సాధించడానికి వారు బుద్ధిపూర్వకంగా మరియు న్యా యంగా ఉండాలనిఎన్నుకోబడిన నాయకులకు గుర్తు చేశారు. యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల క్రమశిక్షణను అభినందించారు. పాఠశాలలోని పచ్చదనం, విశాలమైన ఆట స్థలం విద్యార్థులు నేర్చుకునేందుకు, ఎదగడానికి బాగా సరిపోతుందని ఆమె తెలిపారు.వైస్ చైర్ పర్సన్ ప్రార్థన మణికొండ విద్యార్థులను అభినందించి వారిని విధులకు కట్టుబడి ఉండాలని సూచించారు. వివిధ సభలను ఏర్పాటు చేయడం, వాటిని క్యాబినెట్‌ల అధిపతులు నడిపించడం వల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, స్వీయ క్రమశిక్షణ పెంపొందుతాయని ఆమె ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులుఫమీదా, రామాంజుల, ఫాతిమా కాజిమ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News