Friday, October 18, 2024

లండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1200 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా సంయుక్త కార్యదర్శి గొట్టిముక్కల సతీష్ రెడ్డి వ్యవహారించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆప్జల్ కియానీ పాల్గొన్నారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు అక్కడి ప్రజలను మంత్రముగ్ధులను చేసింది.
ఎన్నారైలంతా సమాజ సేవలో క్రియాశీలకంగా: హౌంస్లౌ మేయర్
హౌంస్లౌ మేయర్ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని కితాబునిచ్చారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందని, లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ఆయన ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు.
ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు
టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ టాక్ సంస్థ తెలంగాణ ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. టాక్ సంస్థకు అన్ని సందర్భాల్లో సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు వారు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం అన్న లేని లోటు ఉన్నా తన సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నామని వారు తెలిపారు. ఆడబిడ్డలందరూ బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు చేయడం ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్‌లో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వారు వివరించారు.
బోనాలు, బతుకమ్మ వేడుకలు వైభవంగా: అశోక్
ఎన్నారై బిఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ దూసరి మాట్లాడుతూ లండన్‌లో రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందన్నారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు, బతుకమ్మ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అనిల్ కూర్మాచలం దశాబ్ద కాలంగా తెలంగాణ సంస్కృతీని ఎంత ముందుకు తీసుకువెళ్లారో ఆయన గుర్తు చేశారు. లండన్‌లో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులను ఆయన సత్కరించారు.
ప్రత్యేక ఆకర్షణగా మహా శక్తి నృత్యం వేడుకలు
కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి తెలంగాణ ప్రగతిని దేశానికి తెలిసేలా చేశారని, అదే స్పూర్తితో, నేడు జాతీయ జెండా ఆవిష్కరించి ప్రవాస తెలంగాణ బిడ్డలంతా కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జాహ్నవి, హరి గౌడ్ నవపేట్, సత్య చిలుముల, రాకేష్ పటేల్, సత్యపాల్ పింగిళి, శ్రీకాంత్, క్రాంతి, మధుసూదన్ రెడ్డి , రాజేష్ వాకా, శ్రీవిద్య ,శ్రావ్య తదితరులు ఉన్నారు.

TAUK 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News