Monday, December 23, 2024

ఘనంగా గిరిజన దినోత్సవం

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : కేసముద్రం మండలంలోని భవానిగడ్డ తండా, బోడమంచ్యాతండా, ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామ శివారు తారాసింగ్ తండాలో శనివారం ఘనంగా గిరిజన దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బోగ్‌బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సతీమణి సీతామహాలక్ష్మిపాల్గొన్నారు. బోగ్‌బండారో కార్యక్రమంలో శ్రీ సంత్‌సేవాలాల్ మహారాజ్‌కి పూజలు చేసి, స్థానిక గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.

కార్యక్రమంలో ఎంపిపి చంద్రమోహన్, జడ్పిటిసి రావుల శ్రీనాథ్‌రెడ్డి, మార్కెట్ ఛైర్‌పర్సన్ నీలం సుహాసిని, మండల పార్టీ అధ్యక్షులు ఎం.డి.నజీర్ అహ్మద్, ఎంపిడిఓ రవీందర్‌రావు, బోడ రాజేందర్, తారాసింగ్ తండా కార్యక్రమంలో సర్పంచ్‌లు సపావట్ శంకర్, నీలం యాకయ్య, స్పెషల్ ఆఫీసర్ ధన్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News