Sunday, December 22, 2024

బిఎస్ రావుకు కూనంనేని ఘన నివాళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాదులోని నార్సింగ్‌లో ఓం కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన సంస్థ సభలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ బిఎస్ రావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించి 80 వేల మందికి ఉపాధిని కల్పిస్తూ సుమారు 7.30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారన్నారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్య దర్శి రావి శివరామకృష్ణ, ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, ఎఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యప్రసాద్, ఎఐఎస్‌ఎఫ్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి వాకిటి రఘు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News