Monday, December 23, 2024

చేనేత కార్మికులకు ఘనంగా సన్మానం

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : పెబ్బేరు మండల పరిషత్ కార్యాలయంలో చేనేత దినోత్సవం సందర్భంగా సోమవారం శాఖాపూర్, సూగూరు ,తిప్పాయిపల్లి, పెబ్బేరు గ్రామాలకు చెందిన చేనేత కార్మికులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిపి ఆవుల శైలజ కురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించారు.

ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలతో తల్లడిల్లిన చేనేత పరిశ్రమ, నేడు స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్ధేశనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో జీవం పోసుకుని పునర్వైభవం దిశగా ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు.

తెలంగాణ సర్కారు తోడ్పాటుతో చేనేత కార్మికులు సొంతూర్లలోనే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని, చేనేత మిత్ర స్కీమ్ కింద నూలుపై సబ్సిడీ, ప్రత్యేక పొదుపు పథకంలో నేతన్నకు చేయూత, చేనేత భీమా వంటి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. చేనేత రుణమాఫీ, నేత కార్మికులకు పింఛన్, బ్లాక్ లెవల్ క్లస్టర్లు ఏర్పాటు తదితర కార్యక్రమాలలో చేనేత కార్మికుల స్థితిగతులు మారాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, వైస్ ఎంపిపి కోట్ల బాల్ చంద్రారెడ్డి, ఎంపిఓ రోజా, సర్పంచులు వెంకటస్వామి, మహేశ్వర్‌రెడ్డి, రాజవర్థన్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు యాదగిరి, పరమేష్ నాయి, పంచాయితీ కార్యదర్శులు శేఖర్ రెడ్డి, వినేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News