Tuesday, January 21, 2025

మరింత మారనున్న గ్రేటర్ రూపురేఖలు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ రూ పు రేఖలు మరింత మారున్నాయి.హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దమే లక్షంగా జిహెచ్‌ఎంసి ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో నగరం అంతర్జాతీయ నగరాలకు దీటుగా మారిపోయింది. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధ్ది ప్రణాళిక (ఎస్‌ఆర్‌డిపి) ద్వారా మొదటి దశ కింద చేపట్టిన అనేక ప్రాజ్టెకులు పూర్తి కావడంతో రెండవ దశ పనులపై అధికారులు దృష్టిషారించారు.

రెండవ దశ పనులకు సంబంధించి గత ఏడాదే అధికారులు పూర్తి కసరత్తు చేయడమే కాకుండా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా, ఇందులో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం సవరణలను సూచిస్తూ వాటిని సరి చేసి పంపించాల్సిందిగా ఆదేశించడం దీంతో జిహెచ్‌ఎంసి అధికారులు తిరిగి వాటిని ని వేదించడం, ప్రభుత్వం సైతం ఒకే చెప్పడంతో ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. దీంతో ఈ పనులు కూడ మొదలై పూరైతే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం రూపు రేఖలే మారిపోవడమే కాకుండా ప్రజలకు మరింత సురక్షితమైన, వేగవంతమైన ప్ర యాణం అందుబాటులోకి రానుంది.
రెండవ దశలో రూ.4422.29 కోట్లతో 36 పనులు
ఎస్‌ఆర్‌డిపి రెండవ దశ పనులు పూరైయితే నగరం రూపు రేఖలు సమగ్రంగా మారడమే కాకుండా నగర ప్రయాణికులను దాదాపుగా సిగ్నల్ రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. మొదటి దశ పనుల్లో ఎల్‌బినగర్, చార్మినార్, శేరిలింగంపల్లి జోన్లలో అత్యధిక పనులు చేపట్టగా కొంత మేర ఖైరతాబాద్ జోన్‌ల్లో సైతం కొన్ని ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో భా గంగా మొదటి దశ కింద జిహెచ్‌ఎంలో రూ. 805 2.92 కోట్ల వ్యయంతో 48 పనులను చేపట్టగా ఇందులో 35 అభివృద్ది పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇందులో 19 ప్లైఓవర్లు, 5అండర్ పాస్‌లు, 7ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిలు, ఒక కేబుల్ బ్రిడ్జితో పాటు మరో మూడు ప్రాజెక్టులు ) ఉన్నాయి. మిగిలిన 11 పనులు సైతం శర వేగంగా కొనసాగుతుండడంతో చాలామేరకు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో రెండవ దశ పనులను సైతం ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే రెండవ దశ పనులల్లో సికింద్రాబాద్, కూకట్‌పల్లితో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రెండవ దశ పనుల్లో 27 అతి ముఖ్యమైన ప్రాజెక్టులను చేపట్టబోతున్నారు. దీంతో ఈ రెండు జోన్లల్లో రోడ్ల స్థితి గ తులు పూర్తిగా మారిపోడమే కాకుండా నగరం మరింత అందగా కనిపించనుంది.
రెండవ దశలో చేపట్టనున్న పనుల వివరాలు
ఎస్‌ఆర్డీపీ ఎస్‌ఆర్‌డిపి రెండవ దశ కింద త్వరలోనే 36 పనులు చేపట్టనున్నారు. ఇందులో అత్యంత ప్రాధాన్యత గల స్కై వేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ తదితర పనులు చేపట్టనున్నారు. అయితే కొన్ని ప్రాజెక్టులకు రక్షణ శాఖ భూములు అడ్డక్కింగా మారడంతో కూక్కట్‌పల్లి జోన్ పరిధిలో పలు సర్కిళ్ల ప్రజలతో పాటు నిజామాబాద్, కరీంనగర్ జాతీయ రహదారుల గుండ వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ నుంచి ఆ స్థలాలను తీసుకునేందుకు గట్టి ప్రయత్నంలో ఉండడం, అవి ఫలిస్తే ప్యాట్నీ సర్కిల్ మొదలు బొల్లారం వరకు ప్లైఓవర్లతో పాటు ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి మీదగా సుచిత్రవరకు రోడ్ల అభివృద్ది పనులను ఈ రెండవ దశలోనే చేపట్ట అవకాశాలున్నాయి. అదే విధంగా కూకట్ పల్లి వై జంక్షన్, కుత్బుల్లాపూర్‌లో ఫాక్స్ సాగర్ పైప్‌లైన్‌పై వంతెన నిర్మాణం, మాణికేశ్వర్ నగర్ ఆర్ యూబీ, చిలుకలగూడలో ఆర్‌యూబీ తదితర పనులను చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News