Thursday, January 23, 2025

స్టాక్ మార్కెట్‌లో హ్యాపీ ఫ్రైడే!

- Advertisement -
- Advertisement -
900 లాభపడ్డ సెన్సెక్స్

ముంబై: గత కొన్ని రోజులుగా నష్టాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ నేడు(శుక్రవారం) లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 899.62 పాయింట్లు లేక 1.53 శాతం లాభపడి 59808.97 వద్ద, నిఫ్టీ 272.40 పాయింట్లు లేక 1.57 శాతం లాభపడి 17594.30 వద్ద ముగిసింది. ఈ రోజు ఆది నుంచే మార్కెట్ లాభల బాటలో పయనించింది. అమెరికాకు చెందిన జిక్యూజి భాగస్వాములు రూ. 15446 కోట్లు పెట్టుబడి పెట్టడంతో అదానీ గ్రూప్ స్టాక్‌లు లాభపడ్డాయి. ఈ పెట్టుబడితో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ. 68351.84గా ఉంది.

నేడు నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్, ఎస్‌బిఐ, భారతి ఎయిర్‌టెల్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధానంగా లాభపడగా, టెక్‌మహీంద్ర, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, డివీస్ లాబ్స్, ఏసియన్ పెయింట్స్ ప్రధానంగా నష్టపోయాయి. డైలీ ఛార్టుల ప్రకారం నిఫ్టీ పుల్‌బ్యాక్ మోడ్‌లో ఉంది. షార్ట్ టర్మ్ దృష్టా నిఫ్టీ 17700 నుంచి 17200 మధ్య కదలాడవచ్చని తెలుస్తోంది. అమెరికాలో రికవరీ కారణంగానే నేడు మన దేశీయ మార్కెట్‌లో కూడా ఊపందుకున్నాయనిపిస్తోంది. నిఫ్టీ ఇండెక్స్ లాంగ్‌టర్మ్ మూవింగ్ యావరేజ్ 200 ఈఎంఎ దాటింది. కానీ నిలదొక్కుకుంటుందా అన్నది గమనించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News