Monday, January 20, 2025

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర జీవితం : కెపి వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్‌లోని తన కార్యాలయం వద్ద భాగస్వాములయ్యారు. ఇందులో భాగంగా తన కార్యాలయ పరిసరాల్లో పేరుకుపోయిన నీటిని శుభ్రపరచడంతో పాటు, పూల కుండిలతో పాటు, వివిధ పాత్రల్లో నిం డిన నీటిని శుభ్రపరిచారు. ఎక్కడైనా పేరుకుపోయిన వాననీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్తులై తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజి ఏఈ ఉమారాని, సిబ్బంది, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నియోజకవర్గ బీఆర్‌ఎస్ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News