Saturday, December 21, 2024

ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపొందించాలి: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల ధృవీకరణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటరు జాబితా రూపకల్పన ఫారం 6,7,8 డిస్బోజల్ ఈరోల్ అప్డేషన్ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులు లేకుండా ఆరోగ్యకరమైన ఓటరు జాబితాను రూపొందించాలన్నారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలు క్షేత్రస్థాయిలో మరోసారీ ధృవీకరణ పూర్తి చేయాలన్నారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలకు సంబంధించి కారణాలను స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఒకే ఇంటిలో 6మంది కంటే ఎక్కువగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపారు.

జిల్లాలోని అన్ని పోలీంగ్ కేంద్రాలలో అవసరమైన మౌళిక వసతులు ఉండాలని పోలీంగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల ఏర్పాటు లైటింగ్ తాగునీరు అవసరమైన ఫర్నీచర్ టాయిలెట్‌లు ఇతర సదుపాయాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ వారిగా ప్రణాళికలు తయారు చేసి ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉనన సిబ్బంది వారికి శిక్షణ తదితర అంశాలతో సంపూర్ణ సమాధానాలతో ప్రణాళిక రూపొందించి తీసుకోవాలన్నారు. స్విప్ యాక్షన్ ప్లాన్ ప్రతి నియోజకవర్గం వారీగా తయారు చేయాలని, స్వీప్ కార్యక్రమాలు విస్త్రృతం చేయాలని సమస్యాత్మక ఓనరబుల్ పోలీంగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. ఈవిఎం మొబైల్ డెమోనిస్ట్రేషన్ సెంటర్ షెడ్యూల్ రూపొందించాలని ఈఆర్‌ఓలకు సూచించారు. దివ్యాంగుల ఓటరు జాబితాను తీసుకోవాలని, 80పైబడిన వయసుగల ఓటరు జాబితాను పరిశీలించాలన్నారు.

ప్రతి నియోజకవర్గంలో పోలీంగ్ కేంద్రంలో పురుషులు మహిళల ఓటర్ల వివరాలు వయస్సు వారీగా జనాభా నిష్పత్తి వివరాలు లింగ నిష్పత్తి నివేదికలు తయారు చేయాలన్నారు. ధరణి పెండింగ్ దరఖాస్థులన్నింటినీ వారంలో పరిష్కరించి ఆర్‌డిఓల స్థా యిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూర్తి చేయాలన్నారు. జిఓ 58,59కింద వచ్చిన దరఖాస్థులను ఈ నెల24లోగా వెరిఫికేషన్ చేసి దరఖాస్థులను అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ నెల30లోగా ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కావాలని, ఆదిశగా ఆయా గ్రామం మండలాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్‌లు చంద్రశేఖర్, మాధురీ, డిఆర్‌ఓ నగేష్, ఆర్‌డిఓలు రవీందర్‌రెడ్డి, పాండు, వెంకారెడ్డి, తహశీల్దార్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News