- ఆపన్న హస్తం మిత్ర బృందం సేవలు అభినందనీయం: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్: భారీ వర్షాలతో కట్టు బ ట్టలు మినహా ఏమీ మిగల్చకుండా ఊడ్చేసిన వరదలు, ఇండ్లు ఆస్తులు నామరూపాలు లేకుండా వరద పాలైన హృదయ విదారకమైన దృశ్యాలు మనసున్న ప్రతిఒక్కరినీ కంటతడిపెట్టించక మానవు.. అలాంటి జలప్రళయంలో సర్వస్వం కోల్పోయి ఆపన్న హస్తాల సాయం కోసం ఎ దురు చూస్తున్న బాధితులను తమ వంతుగా ఆదుకునేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఆపన్న హస్తం మి త్ర బృందం ముందుకు వచ్చింది. ఎక్కడ ఎవరికి ఆపద ఉందని తెల్సినా స్పందించే ఈ సంస్థ సభ్యులు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రస్తుతం ములుగు జిల్లాలోని దొడ్ల గ్రామానికి నిరాశ్రయులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు ఇవ్వటానికి ఆపన్న హస్తం మిత్ర బృందం బయలు దేరింది. సుమారు రూ.లక్షకు పైగా విలువైన సామగ్రితో బయలు దేరుతున్న ఈ వాహనాన్ని ఎమ్మెల్సీ డా. యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తాలు జెండా ఊపి ప్రారంభించారు.
దొడ్ల గ్రామంలోని 70 కుటుంబాలకు పది రోజులకు అవసరమైన బియ్యం, నూనెలు, పప్పులు ఇతర నిత్యావసర వస్తువులు, ప్రతిఒకరికీ దుప్పట్లు పంపిణీ చేయటానికి తీసుకువెళ్తున్నామని ఆపన్న హప్తం మిత్ర బృందం అధ్యక్షుడు బాల చంద్రం, కార్యదర్శి సుమిత్రా శ్రీనివాస్‌లు తెలిపారు. ఈ మిత్ర బృదం చేస్తున్న సేవ అభినందనీయమని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంధ సంస్థలు కూడా ఇలా ఆపన్న హస్తం మిత్ర బృందం లాగా ముందుకు వస్తే బాధితులకు కొంతైనా స్వాంతన కలుగుతుందని ఆయన అన్నారు. సోమవారం సాయంత్రానికి దొడ్ల గ్రామంలో బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని వారు తెలిపారు.