Wednesday, January 22, 2025

రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ షురూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో ఆశిష్. ఇప్పుడు సెల్ఫీష్ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆశిష్ మూడో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ మూవీ రొమాంటిక్ హారర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది. ఈ ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శిరీష్ సమర్పణలో ’బలగం’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని అందించిన యంగ్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలతో పాటు నాగార్జున మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి చినబాబు, నాగవంశీ తదితరులు హాజరయ్యారు. ఈ రొమాంటిక్ హారర్ లవ్ స్టోరీ కోసం సినీ ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News