Saturday, November 23, 2024

గిరిజనులకు బాసటగా ఉద్యాన డిగ్రీ కళాశాల

- Advertisement -
- Advertisement -

మంత్రి సత్యవతి రాథోడ్
తగిన ఏర్పాట్లు చేయాలని విసికి మంత్రి ఆదేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభమవుతున్న హార్టికల్చర్ డిగ్రీ కళాశాలలో గిరిజనులకు బాసటగా నిలుస్తుందని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నీరజ శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వక కలిశారు. మహబూబాబాద్ జిల్లా మల్యాల గ్రామంలోని కృషి విజ్ఞాన్ కేంద్రం (కెవికె)కి అనుబంధంగా హార్టికల్చర్ డిగ్రీ కళాశాల తరగతులు ఈ ఏడాది నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు పలు సూచనలు చేశారు.

కళాశాల ఏర్పాటు, తరగతుల నిర్వహణ, విద్యార్థులకు సంబంధించిన వసతులు, సౌకర్యాల కల్పన, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా మంత్రి విసికి సూచించారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరొందిన మానుకోట జిల్లాలో ఉద్యాన డిగ్రీ కళాశాల ఏర్పాటుతో వ్యవసాయం, అనుబంధ రంగ సంస్థలు అభివృద్ధికి ఉంతగానో దోహదపడుతుందని అన్నారు. గిరిజన రైతాంగానికి బాసటగా నిలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించడంతోపాటు గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాను మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కీలక సంస్థలను ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News