Wednesday, January 22, 2025

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు ఇల్లు

- Advertisement -
- Advertisement -
  • కుమ్మరి ఎల్లమ్మకు కట్టించిన ఇంటిని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

శామీర్‌పేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు కుమ్మరి ఎల్లమ్మ ఇల్లు లాంటి ఇంటిని కట్టించి ఇస్తామని టిపిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామానికి గతంలో రచ్చబండ కార్యక్రమంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎల్లమ్మకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని స్థానిక జడ్పిటిసి సభ్యుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన ఇంటిని గృహప్రవేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ముందుగా లక్ష్మాపూర్ గ్రామంలో ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హారివర్దన్‌రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహాయాదవ్, వైస్ ఎంపిపి మంద శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ వైద్యనాధ్, సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి , మహేష్ గౌడ్, సురేందరు దిరాజ్, జగన్నాధం, వీరేషం, దోసకాయల వెంకటేష్, రవీందర్ రెడ్డి , శిల్పాయాదగిరి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News