Sunday, December 22, 2024

ఇంటింటి సర్వే సమగ్రంగా చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన రోడ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 103 పరిధిలో గల ఓటర్లను ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ పద్మను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ బూతు స్థాయిలో 1137 ఓటర్లు ఉన్నారని ఇంటింటి ఓటర్ సర్వే 90 శాతం పూర్తి చేశానని కలెక్టర్‌కు పద్మ వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితాలో మార్పులు,చేర్పులు ఓటర్ కార్డులలో సవరణ మొదలు అంశాల పై నివేదకలను ఈ ఆర్ ఓ నెట్ ద్వారా సమర్పించాలని తెలిపారు. ఓటరు సవరణలో వచ్చిన దరఖాస్తులు వాటి పై తీసుకొని చర్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేటలోని కృష్ణ కాలనీ గల పిఎస్ నెంబర్ 44 లో గల అవసరమగు మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు.

సూర్యాపేట మండల స్థాయిలో లొకేషన్ మార్చవలసినవి 2 పోలింగ్ కేంద్రాల పేరు మార్పులను అలాగే 1500 ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న రెండు పోలింగ్ స్టేషన్‌లను అదనంగా ఏర్పాటు చేయవలసిన పోలింగ్ స్టేషన్ గురించి తహశీల్దార్ వెంకన్న కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ వెంకన్న, సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News