Friday, November 22, 2024

ఖమ్మంలో క్రైస్తవుల భారీ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, మారణకాండను నిరసిస్తూ ఖమ్మం పట్టణ పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సెయింట్ మేరీ పాఠశాల గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బోనకల్ క్రాస్ రోడ్, జమ్మిబండ రోడ్ మీదుగా ధర్నాచౌక్‌కు చేరుకుంది. ఈ సందర్బంగా పలువురు మణిపూర్ మారణకాండను నిరసిస్తూ ప్లకార్డులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్ వేముల సత్యం మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న మారణకాండ ఆపాలని, చర్చిలను కూల్చివేయడం నిలిపివేయాలని, శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రధాని, హోం మంత్రి సహా మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికారులు అంతా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వేముల సత్యం, పాస్టర్ సిహెచ్ డేనియల్, పాస్టర్ జె. రాధాకృష్ణ, ప్రెసిడెంటు ఎన్. శామ్యూల్, సెక్రటరీ వేణు మోసెస్, వైస్ ప్రెసిడెంటు యోసెప్, కోశాధికారి జకరయ్య, సంయుక్త కార్యదర్శి ఎం. రాజు, పాస్టర్ జి. బాలస్వామి, పాస్టర్ జార్జ్ ముల్లర్, పాస్టర్ ఇర్మియా, పాస్టర్ కొమ్ము బాబూరావు, బిషప్ ఇస్సాక్ పాల్, పాస్టర్ తిమోతి రామారావు, పాస్టర్ గిరీష్, పాస్టర్ కె. దేవరాజ్, పాస్టర్ సిహెచ్. రమేష్, తదితరులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News