Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డికి భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కూతురు తుల్జా భవానీరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తండ్రి మీద మీడియా ముందు విపరీతమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది తుల్జా భవానీ. అయితే ఈ తండరీ కూతుళ్ల కోల్డ్ వార్ కొత్త మలుపు తిరిగింది. భవానీ అడ్డగోలుగా తన మీద ఆరోపణలు చేయకుండా నిలువరించేలా కోర్టు ద్వారా భవానీకి ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి నోటీసులు జారీ చేశారు. తన పరువుకి భంగం కలిగించేలా కూతురు తుల్జా భవానీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని, అందుకు తగ్గ ఆదేశాలు జారీ చేయాలని హైదరాబాద్ సిటి సివిల్ కోర్టును ముత్తిరెడ్డి ఆశ్రయించారు. ముత్తిరెడ్డి విజ్ఞప్తిని కోర్టు పరిశీలించింది.

ప్రెస్, మీడియా, వాట్సాప్ ద్వారా పర్కటనలు, యూ ట్యూబ్, ఇతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాతో సహా మౌఖిక లేదంటే వ్రాత రూపంలో నేరుగా కానీ, పరోక్షంగా కానీ మాట్లాడవద్దని తుల్జా భవానీరెడ్డికి కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వు ్ట జారీ చేసింది. తద్వారా ముత్తిరెడ్డికి భారీ ఉపశమనం లభించింది. భూవ్యవహారంతో మొదలైన ఈ తండ్రీకూతుళ్ల మాటల యుద్ధం రోజురోజుకి ముదిరిన సంగతి విదితమే. ఈ క్రమంలో యూట్యూబ్ సహా అన్ని మీడియా ఛానెల్స్ ముందు తండ్రిపై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారామే. అంతేకాదు, తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని చెబుతూనే తన తండ్రి దుర్మార్గుడని, సీటు ఇవ్వొద్దంటూ బిఆర్‌ఎస్ చీఫ్ కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసిందామే. ముత్తిరెడ్డి మాత్రం తమ కుటుంబ సమస్యలను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని, తన కూతురిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తన కూతురు, అల్లుడు తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ దాఖలైన కేసులో విచారణ కూడా కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News