Friday, December 20, 2024

రష్యా భారీ విజయం

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ సిటీ రష్యా కైవసం
మాస్కో/కీవ్ : ఉక్రెయిన్‌లోని అవ్దివక పట్టణం పూర్తిగా తమ అధీనంలోనే ఉందని రష్యా ఆదివారం తెలిపింది. తమ ధాటికి ఉక్రెయిన్ సేనలు అక్కడి నుంచి వైదొలిగాయని, అయితే కొద్ది సంఖ్యలో సైనికులు సోవియట్ కాలం నాటి ఓ బొగ్గు గనిలో దాక్కుని ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఇరుపక్షాల నడుమ యుద్ధం సాగింది. ఇప్పుడు ఈ పట్టణం పూర్తిగా తమ వశం కావడం తమకు పూర్తిస్థాయి విజయం అని వెల్లడించారు. గత ఏడాది మేలో బక్ముత్ సిటిని స్వాధీనం చేసుకున్న తరువాత తమ దళాలకు పూర్తి స్థాయిలో దక్కిన విజయం ఇదేనని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News