Tuesday, December 24, 2024

భార్యను చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

చర్ల : ఓ వ్యక్తి తన భార్యను కనికరం లేకుండా దారుణంగా ఉరేసి చంపిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండల కేంద్రానికి సమీపంలో నివాసం ఉంటున్న పాతగట్ల రవి అనే వ్యక్తి తన భార్య సుజాత (35)ను ఆదివారం అర్థరాత్రి ఉరేసి హత్య చేసి ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేశాడు. ఆపై తన భార్యకు గుండెపోటు వచ్చిందని దాంతో చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

మృతురాలి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు ప్రశ్నించటంతో రవి పారిపోయాడు. కాగా ఇల్లందుకు చెందిన రవి తన భార్యా, ఇద్దరు పిల్లలతో జీవనోపాధి కోసం చర్లకు వలస వచ్చాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేఖరిగా పని చేస్తున్నాడని సమాచారం. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు చర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News