Monday, January 20, 2025

భార్యను హత్య చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భార్యను ఉరివేసి భర్త హత్య చేసిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పిఎస్ పరిధిలోని కమలానగర్‌లో ఫర్జానా, ఫిరోజ్ దంపతులు జీవిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం కాగా, ఫిరోజ్ డెకరేషన్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా భార్యభర్తల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గొడవలు ఎక్కువ కావడంతో ఫిరోజ్, ఫర్జానా మెడకు దుప్పటి బిగించి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భార్యను హత్య చేసిన ఫిరోజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News