Friday, November 15, 2024

ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలక మార్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఆర్మీ కీలక మార్పు చేసింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్( సిఇఇ) నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. ఈ మార్పునకు సంబంధించి ఆర్మీ వివిధ వార్తాపత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలవడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలియజేశారు.

ప్రస్తుతం అగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్టు, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు కామన్ ఎంట్రెన్స్‌పరీక్షకు హాజరు కావలసి ఉంటుంది. ఇకపై తొలుత సిఇఇని నిర్వహించనున్నారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీని తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 200కు పైగా కేంద్రాల్లో ఏప్రిల్‌లో తొలివిడత సిఇఇ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023 24రిక్రూట్‌మెంట్‌లో చేరబోయే దాదాపు 40 వేల మందికి ఈప్రక్రియ వర్తించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News