Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం

- Advertisement -
- Advertisement -

ఈడి అధికారిపై లంచం కేసు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ మధ్యం కుంభకోణంలో కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈడి డైరెక్టరేట్ అధికారిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈడి అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రి, క్లారిడ్జ్ హోటల్స్ రిసార్ట్ చీఫ్ విక్రమాదిత్య సింగ్, ఎయిరిండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్ లపై కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతరులపై ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసును ఈడి విచారణ జరుపుతోంది. ఇందులో అమన్ దీప్ సింగ్ దాల్ కూడ నిందితుడు. ఈ ఏడాది తొలి నాళ్లలో ఈడి అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అమన్ దీప్ సింగ్ ధాల్ కు సహాయం చేసేందుకు పవన్ ఖత్రీ, ఈడిలో క్లర్క్ గా పనిచేస్తున్న నితేష్ కోహర్ ద్వారా రూ. 5 కోట్లు లంచంగా స్వీకరించినట్టుగా దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ధాల్ అతని తండ్రి బీరేందర్ పాల్ సింగ్ ఈడి దర్యాప్తులో సహాయం కోసం ఈడి అసిస్టెంట్ ఖత్రీకి రూ. 5 కోట్లు ఇచ్చినట్టుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ కేసు నమోదు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News