Monday, January 20, 2025

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తేవాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. బాలమల్లేష్

మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తారంగా ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, దళిత సామాజిక సంఘాల ఆధ్వర్యంలో దళిత సమ్మేట్ రాష్ట్ర సదస్సులో ఎన్ బాల మల్లేష్ పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తూ దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మహిళలు మైనార్టీలు వెనుకబడిన తరగతులు అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు వారి దరి చేరటం లేదని విమర్శించారు. తిరోగమన భావజాలం కలిగిన బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ హక్కుల పైన దాడులు తీవ్రతరం చేసిందని అన్నారు. రాజ్యాంగానికి గుండెకాయ లాంటి ప్రజాస్వామ్యం సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగ ప్రవేశిక నుండి తొలగించడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. విస్తారంగా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అందులో రిజర్వేషన్ అమలు చేయకపోవడం వల్ల దళితులు గిరిజనులు బడుగు బలహీన, మైనార్టీలు వర్గాలకు దక్కడం లేదని విమర్శించారు.

ప్రముఖ జర్నలిస్టు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రసంగిస్తూ జనాభా దామాషా ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించిన వారి అభివృద్ధికి ఖర్చు పెట్టే ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టానికి నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి మాత్రమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. భూములేని దళిత కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ భూములు పంచాలని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రసంగిస్తూ దేశంలో దళిత ఎజెండా ప్రకటించి దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు దళితుల హక్కులు గ్రామీణ ఉపాధి చట్టం, అటవీ హక్కుల చట్టాలు రక్షించాలని దేశవ్యాప్తంగా పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరాముల ప్రసంగిస్తూ డిసెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర నుండి వందలాదిగా చలో ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో దళిత హక్కుల పోరాట సమితి కుల వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మారుపాక అనిల్ కుమార్, బాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కుమార్ రాష్ట్ర నాయకులు మహాలక్ష్మి పర్ష ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News