Thursday, January 23, 2025

ట్రంప్ నిర్ణయాన్ని కట్టడి చేయాలని ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే డెమోక్రటిక్ పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉత్తర్వులను కట్టడి చేయాలని కోరుతూ ఫెడరల్ కోర్టులోగురువారం బహుళ రాష్ట్ర వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించేందుకు సీటిల్ లోని ఫెడరల్ జడ్జి గురువారం సిద్ధమయ్యేరు. ఆరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్, వాషింగ్టన్, రాష్ట్రాల అభ్యర్థన మేరకు అమెరికా జిల్లా జడ్జి జాన్ కొఘెనవర్ విచారించడానికి అంగీకరించారు. డెమోక్రటిక్ పాలనలోని 22 రాష్ట్రాల ఐదు వ్యాజ్యాలలో ఇదొకటి. జన్మతః వచ్చే హక్కు ద్వారా అమెరికా పౌరులైన అటార్నీ జనరల్ వ్యక్తిగత సాక్షాలు కూడా ఈ వ్యాజ్యాల్లో ఉన్నాయి.

పుట్టబోయే తమ బిడ్డలు అమెరికా పౌరులు కాలేనందుకు భయపడే గర్భిణీ స్త్రీల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు ఫిబ్రవరి 19 నుంచి అమలు లోకి రానున్నాయి. దాఖలైన ఒక వ్యాజ్యం ప్రకారం ట్రంప్ ఉత్తర్వులు అమెరికా గడ్డపై జన్మించిన వేలాది మందిపై ప్రభావం చూపిస్తాయి. సీటిల్‌లో దాఖలైన నాలుగు రాష్ట్రాల వ్యాజ్యం ప్రకారం అక్రమంగా అమెరికాలో ఉంటున్న తల్లులకు 2022 లో 2,55, 000 మంది జన్మించగా, అలాంటి తల్లిదండ్రులకు 1,53,000 మంది జన్మించారు. అమెరికా రాజ్యాంగంలో 14 వ సవరణ ప్రకారం పిల్లలకు సంక్రమించిన పౌరసత్వ హక్కును రద్దు చేయకూడదని, ట్రంప్ నిర్ణయాన్ని కట్టడి చేయాలని ఈ వ్యాజ్యాలు కోరుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News