Wednesday, January 22, 2025

మేకల మందపై చిరుత పులి దాడి

- Advertisement -
- Advertisement -

కుంటాల :నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లి అటవీ క్షేత్రంలో గురువారం చిరుత పులి మేకల మందపై దాడి చేసిన సంఘటన వెలుగు చూసింది . వివరాల్లోకి వెళితే రోజువారిగా శీలం సురేందర్ హల్వా గంగయ్యలు కలిసి దౌనెల్లి అటవీ క్షేత్రానికి రోజువారీగా మేకలను మేపడానికి మేకల మందను తీసుకువెళ్లగా పొదలో చిరుత పులి ఒకేసారి మేకల మందపై దాడి చేసింది. దీంతో మేకల కాపర్లు కేకలు వేయడంతో హుటాహుటిన చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో రూ. 16 వేల విలువగల మేకను చిరుత పులి ఎత్తుక వెళ్లగా మరి కొన్ని మేకలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వెంటనే మేకల మందను ఇంటికి తీసుకువచ్చి సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సైతం సంఘటన స్థలానికి చేరుకున్నారు అనంతరం గాయపడిన మేక లకు చికిత్సలు అందిస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News