Friday, January 10, 2025

సహజీవనం చేస్తున్న జంట.. నిప్పంటించుకుని సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల సౌమిని దాస్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. కేరళకు చెందిన 29 ఏళ్ల అభిల్ అబ్రహాం బెంగళూరులో నర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. కొన్ని నెలల కిందట వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రిలేషన్‌లో ఉన్న ఈ జంట కొత్తనూర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు. కాగా, ఆదివారం సౌమిని దాస్, అభిల్ అబ్రహాం కలిసికట్టుగా నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వారి అరుపులు, మంటలు గమనించిన పొరుగువారు తలుపులు బద్ధలుకొట్టి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే మంటల్లో కాలి సౌమిని మరణించింది. అభిల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెళ్లైన సౌమిని దాస్ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లోని సొంతూరుకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అభిల్‌తో సహజీవనం నేపథ్యంలో భర్తతో కలిసి ఉండలేనని ఆమె చెప్పిందని, ఈ నేపథ్యంలో తలెత్తిన గొడవల వల్ల ఆ జంట సజీవ దహనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News