Friday, December 20, 2024

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మోమిన్‌పేట్: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపిన ప్రకారం వివరాలిల ఉన్నాయి. మండల పరిధిలోని ఎన్కతల గ్రామానికి చెందిన మరాఠి రాంచంద్రయ్య(54) తమ్ముడు మరాఠి కృష్ణ(45) తండ్రి లక్ష్మయ్యలకు అసైన్‌మెంట్ భూమి ఉన్నది. మరాఠి కృష్ణ అదే గ్రామానికి చెందిన ముకుందం కూతురు విజయలక్ష్మితో 15 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరి సంసారం కొన్ని సంవత్సరాలు సాఫీగానే సాగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు.

వీరి మధ్య గొడవలు రావడంతో విజయక్ష్మి తన పుట్టింటికి తన కుమారుడిని తీసుకుని వెళ్లింది. ఎన్కతల శివారులో ప్రభుత్వం ఓ కంపెనీని స్ధాపించడానికి అవసరమైన ప్రభుత్వ భూమి రాంచంద్రయ్య, కృష్ణలకు సంబంధించిన భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం ధరకు డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం నుడి సమాచారం ఉంది. ఈ విషయం తెలిసిన భార్య విజయలక్ష్మి సమచారం తెలుసుకుని తనకు కూడా డబ్బులు ఇవ్వాలని భావ రాంచంద్రయ్య, భర్త కృష్ణను పలుమార్లు అడిగింది. ఈ విషయమై ఆమె గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి అడిగింది.

విషయం ఎంతకు తెగే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకు ఇంట్లో నుండి బయటికి రాకపోవడంతో అన్న రాంచంద్రయ్య తలుపులు తెరిచి చూడగా ఉరి వేసుకుని మృతి చెందినట్టు గుర్తించడం జరిగింది. ఈ విషయమై రాంచంద్రయ్య పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News