Monday, December 23, 2024

భార్య రాలేదని మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నల్గొండ :నాలుగు నెలల నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ పట్టణంలోని సాయి శ్రీ కాలినికి చెందిన మిర్జా నజీర్ బేగ్ (48) ప్రైవేట్ వృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇతని భార్య నౌసీన్, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు.

సుమారు నాలుగు నెలల క్రితం తన భార్య మృతునితో గొడవ పడి తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. తన భార్యను ఎంత బ్రతిమిలాడి సంసారానికి రాకపోడంతో మృతుడు తన భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్ లు పెట్టిన రిప్లై ఇవ్వనందున తన భార్య తిరిగి ఇంటికి రాదని మనస్థాపం చెంది జీవితంపై విరక్తి చెంది శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవ రు లేని సమయంలో పూరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు జాగీర్ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News