Friday, December 20, 2024

కుటుంబ కలహాలతో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోహీర్: కుటుంబ కలహాలతో బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కమ్మరి గోవింద్ (25) అనే వ్యక్తి తన భార్యతో గొడవ పడి మత్తులో క్షణికావేశంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బావిలో ఉన్న మృతదేహం కోసం జహీరాబాద్ ఫైర్ స్టేషన్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ ప్రశాంత్ బృందం క్రేన్ సహాయంతో బయటకు తీశారు. జహీరాబాద్ ఏరియాసుపత్రికి తరలించి శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News