Thursday, December 19, 2024

చంద్రబాబు సిఎం కావాలంటూ నాలుక కోసుకున్న పిచ్చోడు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  చంద్రబాబు నాయుడు మీద పిచ్చి అభిమానంతో ఓ వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత పనిచేశాడు. నగరంలోని బంజారా హిల్స్ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తన నాలుక కోసుకుని దేవుడి హుండీలో వేశాడు. శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర టెంపుల్ వద్ద ఈ ఘాతుకం చేశాడు. అయితే గతంలో కూడా వైఎస్. జగన్ సిఎం కావాలని ఇదే గుడి ముందు ఇదే వ్యక్తి నాలుక కోసుకోవడం ఇక్కడ గమనార్హం.

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని నాలుక కోసుకుని మొక్కు తీర్చుకున్నాను అంటూ తన లెటర్లో రాశాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా గెలవాలని లెటర్లో రాశాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని అతడిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. తరువాత అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News