Wednesday, January 22, 2025

బైక్ ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ:రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన వేములపల్లిమండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన చల్లబొట్ల లకా్ష్మరెడ్డి(65), రాచూరి సత్యంలు మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్‌పల్లి రహదారి దాటుతుండగా వేములపల్లి నుంచి నల్లగొండ వైపు వెళ్తున్నద్విచక్ర వాహనం ఢీకొట్టింది.

దీంతో లకా్ష్మరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News