Thursday, December 19, 2024

లారీ ఢీ కొని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

చేర్యాల: లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపాన చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగపూరి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న వేముల దుర్గయ్య 55 తన అవసరాల నిమిత్త స్కూటీపై వెలుతుండడంతో ప్రమాదవశాత్తు లారీ ఢీ కొని మృతి చెందాడని తెలిపారు. మృతుని స్వంత గ్రామం కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ గ్రామవాసి , ప్రస్తుతం చేర్యాల పట్టణంలోని బీడీ కాలనీలో నివసిస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News