Wednesday, January 22, 2025

డాబాపై నుంచి పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే నిరుపేద వ్యక్తి డాబాపై నుండి బుధవారం రాత్రి కిందపడి మృతి చెందాడు. రాత్రి డాబాపై నుండి సిరాజ్ కాలుజారి కిందపడ్డాడు. అయితే కింద పడగానే సంఘటన స్థలంలో సిరాజ్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కూలీనాలి పని చేసుకొని జీవించే సిరాజ్ అతని భార్య జరినాబీ కడు నిరుపేదలు. ఈ సమాచారం తెలుసుకున్న బిఆర్‌ఎస్ పట్టణ మహిళా నాయకురాలు ఉమాదేవి వారి పరిస్థితిపై జాలిపడి రూ.5 వేలు అంత్యక్రియల కోసం ఆర్థికసాయం చేశారు. ఎంతో నిరుపేద కుటుంబమని, ఆ కుటుంబానికి మానవతా హృదయం కలవారు పెద్ద మనస్సుతో స్పందించి ఏదైనా సాయం చేయాలని ఉమాదేవి ఈ సందర్భంగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News