Wednesday, January 22, 2025

బావిలో పడి వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎమ్మెస్ వైన్‌షాప్ పక్కన ఉన్న పర్మిట్‌రూంలో దొంగతనానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు హవేళిఘనపూర్ కొత్త చెరువు తండాకు చెందిన మడావత్ బాబ్యా(30) అతని అన్న మోహన్‌తో కలిసి రామాయంపేట పట్టణంలోని మెదక్ రోడ్డులో గల వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూంలో దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి తర్వాత పారిపోయే క్రమంలో బాబ్యా పర్మిట్ రూమ్ వెనకాల ఉన్న బావిలో పడిపోయాడు. రెండు రోజుల క్రితం పడిపోయిన బాబ్యా మంగళవారం పర్మిట్ రూమ్ వెనకాల ఉన్న బావిలో శవమై నీటిపై తేలగా మృతుడి భార్య మంజుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగిందని రామాయంపేట పట్టణ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News