Wednesday, January 22, 2025

ఎయిర్ ఇండియా విమానంలో కేరళ ప్రయాణికుడి రభస..అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

 

కోచ్చి: అబు దాబి నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తో దురుసుగా ప్రవర్తించడంతోపాటు విమాన సిబ్బంది, సహ ప్రయాణికులతో గొడవపడిన కేరళకు చెందిన ఒక 51 ఏళ్ల ప్రయాణికుడిని విమానాశ్రయ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లిజాన్ జాకబ్ అనే ప్రయాణికుడు మద్యం మత్తులో విమానంలో గొడవ చేశాడని, ఎయిర్‌లైన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఇక్కడి ఎయిర్‌పోర్టు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. చాలా చిన్న విషయంపైన ఆ ప్రయాణికుడు సహ ప్రయాణికులతోపాటు విమాన సిబ్బందితో వాదులాటకు దిగాడని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. జాకబ్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసినట్లు అ అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News