Thursday, January 23, 2025

లిఫ్ట్ ఇస్తే ఇంజెక్షన్ ఇచ్చి చంపాడు!

- Advertisement -
- Advertisement -

కుక్కలు, కోతులకు ఇచ్చే విషంతో హత్యచేసిన దుండగుడు ఖమ్మం జిల్లాలో దారుణం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఒక వ్యక్తిని ఇంజెక్షన్ విషం ఇచ్చి హత్య చేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండ లం బాణాపురంలో చోటు చేసుకుంది. తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం బొప్పారానికి గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (50) తన చిన్న కుమార్తెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివా హం చేశారు. అయితే జమాల్ సాహేబ్ భార్య గండ్రాయిలోని తన అల్లుడి వద్ద ఉండడంతో ఆమెను తీసుకు వచ్చేందుకు సోమవారం తన ద్విచక్ర వాహనంపై గం డ్రాయికి బయలుదేరాడు. మార్గమధ్యలో ముదిగొండ మండలం బాణాపురం దాటిన తరువాత వల్లబి పంట పొలాలు వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి జమాల్‌ను లిఫ్ట్ అడిగాడు. దీంతో అతడిని తన వాహనంపై ఎక్కించుకుని తీసుకెళ్తున్నాడు. కొంతదూరం వెళ్లగానే వెనుక కూర్చున్న గుర్తు తెలియని వ్యక్తి ఇంజెక్షన్ ఇచ్చాడు. విషయం అర్థంకాక జమాల్ వెంటనే తన బైక్ ఆపాడు. దాంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని వెంటనే జమాల్ తన భార్యకు ఫోన్‌లో తెలిపాడు.

అనంతరం అతడు స్పృహ కోల్పోవడంతో అటుగా వచ్చిన వాహనదారులు 108లో ఆస్పత్రికి తరలించారు. దారిలోనే జమాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో లభించడంతో ఇంజెక్షన్ ద్వారా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు భా విస్తున్నారు. కోతులకు, కుక్కలకు ఇచ్చే విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి చంపినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే మృతి చెందిన వ్యక్తికి, ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తి మధ్య పాత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనా? లేక కాకతాళీయంగా జరిగిన ఘటనా? ఏమైనా రసాయనిక ప్రయోగం జరిగిందా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలంలో సిరంజి లభించడం వల్లనే ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఉండవచ్చని భావిస్తున్నాప్పటికీ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, నివేదిక వచ్చిన తరువాతనే స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పాల్గొన్నట్లు స్థ్ధానికులు భావిస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చిన అగంతకుడు వెంటనే మరో బైక్ ద్వారా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ముదిగొండ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News